స్థానిక సంస్థల్లో బీసీ వర్గీకరణ అనివార్యం

ABN , First Publish Date - 2020-12-02T05:10:22+05:30 IST

రాజకీయాల్లో బీసీల ప్రాధాన్యం పెరిగేలా స్థానిక ఎన్నికల్లో వర్గీకరణ ప్రాతిపదికన అందరికీ అవకాశం కల్పించాలని నాయిబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ శిద్ధవటం యానాదయ్య ప్రభుత్వాన్ని కోరారు.

స్థానిక సంస్థల్లో బీసీ వర్గీకరణ అనివార్యం

 నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ యానాదయ్య

ఏలూరు, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో బీసీల ప్రాధాన్యం పెరిగేలా స్థానిక ఎన్నికల్లో వర్గీకరణ ప్రాతిపదికన అందరికీ అవకాశం కల్పించాలని నాయిబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ శిద్ధవటం యానాదయ్య ప్రభుత్వాన్ని కోరారు. ద్వారకా తిరుమలలో మంగళవారం ఏర్పాటు చేసిన నాయిబ్రాహ్మణ సమావేశానికి వచ్చిన ఆయన ఏలూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో వర్గీకరణ ప్రాతిపదికన అన్ని బీసీ కులాలకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని ఆయన కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏబీసీడీ ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం ద్వారా అత్యంత వెనుకబడిన కులాలకు కూడా అవకాశాలు పెరుగుతాయని, కులాల మధ్య హెచ్చుతగ్గులు తగ్గుతాయని ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళతామని ఆయన తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు తురాయి శ్రీనివాస్‌, బీసీ జేఏసీ చైర్మన్‌ లంకా వెంకటేశ్వర్లు, వి.కాశీ విశ్వేశ్వరరావు, ఉక్కుసూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-02T05:10:22+05:30 IST