10 నుంచి పాఠశాలల్లో కరోనాపై అవగాహన

ABN , First Publish Date - 2020-02-08T12:12:17+05:30 IST

కరోనా వైరస్‌ గురించి అన్ని పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు, ముందస్తు జాగ్రత్తల గురించి విద్యార్థులకు ఈనెల 10వ తేదీ నుంచి 15వ

10 నుంచి పాఠశాలల్లో కరోనాపై అవగాహన

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 7 : కరోనా వైరస్‌ గురించి అన్ని పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు, ముందస్తు జాగ్రత్తల గురించి విద్యార్థులకు ఈనెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక సదస్సులు నిర్వహించి చైతన్యవంతం చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం స్కూలు అసెంబ్లీ సమయంలో, స్కూలు పనివేళల్లో ఖాళీ సమయాల్లోనూ సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఏపీ సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు, వైద్యఆరోగ్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-02-08T12:12:17+05:30 IST