కరోనాపై అవగాహన కల్పించండి : డీఎంహెచ్‌వో

ABN , First Publish Date - 2020-03-13T11:26:35+05:30 IST

కరోనాపై అవగాహన కల్పించండి : డీఎంహెచ్‌వో

కరోనాపై అవగాహన కల్పించండి : డీఎంహెచ్‌వో

ఏలూరు ఎడ్యుకేషన్‌, మార్చి 12 : పీహెచ్‌సీల పరిధిలో ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రతపై చైతన్యవంతం చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.సుబ్రహ్మణ్యేశ్వరి ఆదేశించారు.ఏలూరు డీఎం హెచ్‌వో కార్యాలయంలో కరోనా (కోవిడ్‌-19) వైరస్‌పై  గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రభుత్వం కరోనా వైరస్‌ నివారణపై చేపట్టిన చర్యలను వివరించారు. పీహెచ్‌సీల పరి ధిలో ఏఎన్‌ఎంలు,ఆశా వర్కర్లకు తగిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌వోలు, జిల్లా సర్వైలెన్స్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జోషిరాయ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-13T11:26:35+05:30 IST