కిడ్నాప్‌ చేసి కర్రలతో కొట్టారు..

ABN , First Publish Date - 2020-07-10T11:17:51+05:30 IST

ఓ యువకుడ్ని కిడ్నాప్‌ చేసి ఆ పై కర్రలతో చితక బాదారు. ఆ యువకుడు విజయవాడలోని..

కిడ్నాప్‌ చేసి కర్రలతో కొట్టారు..

చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్‌ మృతి 


ఏలూరు క్రైం, జూలై 9 : ఓ యువకుడ్ని కిడ్నాప్‌ చేసి ఆ పై కర్రలతో చితక బాదారు. ఆ యువకుడు విజయవాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందు తూ మృతి చెందాడు. ఈ ఘటనపై అతని తల్లి ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలివి.. ఏలూరు రూరల్‌ మండలం మాదేపల్లికి చెందిన రెడ్డి గంగాదేవి (రంగమ్మ)కి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడైన శ్యామ్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గంగాదేవి భర్త 19 ఏళ్ల క్రితం మృతి చెందాడు. జూన్‌ 6వ తేదీ సాయంత్రం శ్యామ్‌ ఆటో కిరాయికి వెళ్లి వచ్చాడు. అతనిని అదే గ్రామానికి చెందిన కోసూరి సత్యనా రాయణ అలియాస్‌ బుజ్జి, మల్లెపూడి అదిత్య అలియాస్‌ చిన్నా, వంశీ కలిసి బలవంతంగా గ్రామ పొలాల్లోకి తీసుకెళ్లి తీసుకెళ్లి కర్రలతో కొట్టారు.


అతను చని పోయాడని భావించి వారు వెళ్లిపోయారు. కొద్దిసేపటికి తీవ్ర గాయాలతో అతను ఇంటికి వెళ్లి తల్లికి విషయం చెప్పాడు. వెంటనే అతన్ని తొలుత ఏలూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి అక్కడ నుంచి విజయవాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలిం చారు. అప్పటి  నుంచి అతను చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందా డు. ఈ సమాచారం ఏలూరు రూరల్‌ పోలీసులకు అందింది. ఈ కేసులో నిందితు లైన కోసూరి సత్యనారాయణ, మల్లెపూడి ఆదిత్య, వంశీల కోసం గాలింపు చేపట్టారు. విజయవాడలో ఉన్న శ్యామ్‌ మృతదేహానికి శుక్రవారం ఏలూరు రూరల్‌ పోలీసులు అక్కడకు వెళ్లి పోస్టుమార్టం జరిపించనున్నారు. 

Updated Date - 2020-07-10T11:17:51+05:30 IST