హిందూ ఆలయాలపై దాడులు అమానవీయం

ABN , First Publish Date - 2020-09-17T05:30:00+05:30 IST

హిందూ దేవాలయాలపై దాడులు అమానవీయమని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. సీసలి షిరిడీ సాయిబాబా ఆలయంలో పలువురు టీడీపీ నాయకులతో గురువారం ఆయన నిరసన చేపట్టారు.

హిందూ ఆలయాలపై దాడులు అమానవీయం

కాళ్ళ, సెప్టెంబరు 17 : హిందూ దేవాలయాలపై దాడులు అమానవీయమని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. సీసలి షిరిడీ సాయిబాబా ఆలయంలో పలువురు టీడీపీ నాయకులతో గురువారం ఆయన నిరసన చేపట్టారు. హిందూ ధార్మిక సంస్థలను పరిరక్షించే మంచి బుద్ధి సీఎం జగన్‌కు కల్పించాలని దేవుడ్ని కోరుతున్నామన్నారు.


కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి పెన్మెత్స సత్యనారాయణరాజు, వాటర్‌ డీసీ మాజీ చైౖర్మన్‌ తోట ఫణిబాబు, పార్టీ మండలాధ్యక్షుడు జీవీ నాగేశ్వరరావు, వీరవల్లి శ్రీనివాసరావు, బండారు వేణుగోపాలరావు, కట్రెడ్డి శ్రీనివాసరావు, గుల్లిపల్లి జోగయ్య, బొత్సా గణేష్‌, ఎరుబండి రామాంజనేయులు పాల్గొన్నారు.


ప్రజలు,  ఆలయాలకు రక్షణ కరువు : మాజీ ఎమ్మెల్యే బండారు

నరసాపురం: వైసీపీ పాలనలో ప్రజలకు, ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆరోపించారు. ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్కు రోడ్డులోని సాయి బాబా ఆలయంలో ప్రభుత్వ బుద్ది మారాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం బండారు విలేకర్లతో మాట్లాడుతూ కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చ గొడుతూ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు.


దేవదా యశాఖ మంత్రి కుంటిసాకులతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయడం సిగ్గు చేటన్నారు. ఈ ప్రభుత్వానికి రాష్ట్రానికి, ప్రజలకు మంచి చేసే అలోచనే లేదని ఆయన విమర్శించారు.  ఇప్పటి ముఖ్యమంత్రి జగన్‌ సైకో బుద్ది మారి ప్రజలు, భక్తుల మనోభావాల్ని కాపాడే విధంగా పాలన సాగించాలని సాయిబాబుకు మొక్కామన్నారు.


కార్యక్రమంలో మాజీ ఏఎంసీ ఛైర్మన్లు కొప్పాడ రవి, రాయుడు శ్రీరాములు, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ రత్నమాల, పొన్నాల నాగబాబు, జక్కం శ్రీమన్నారాయణ,  అధికారి ఆనంత రామారావు, భూపతి నరేష్‌, హుసేన్‌, అడిదల డేనియల్‌, నక్కా ఆనందబాబు, తుమ్మలపల్లి లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-17T05:30:00+05:30 IST