ఏఎస్పీగా సుబ్బరాజు బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2020-10-12T17:03:39+05:30 IST

పోలీస్‌ సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని నూతన అదనపు ఎస్పీగా ..

ఏఎస్పీగా సుబ్బరాజు బాధ్యతల స్వీకరణ

ఏలూరు: పోలీస్‌ సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని నూతన అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఏవీ సుబ్బరాజు అన్నారు. సీఐడీ డీఎస్పీగా పనిచేస్తున్న ఆయనకు పదోన్నతి కల్పించి జిల్లా అదనపు ఎస్పీగా పోస్టింగ్‌ ఇవ్వడంతో ఆదివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం రాష్ట్ర గుమ్మడం గ్రామానికి చెందిన సుబ్బరాజు 1989 జనవరి 16న ఎస్‌ఐగా చేరారు. 2001 ఇన్‌స్పెక్టర్‌గాను, 2010లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. విశాఖ, విజయనగరం, కృష్ణా, పశ్చిమ గోదావరి, కర్నూ లు జిల్లాల్లో పనిచేశారు. ఆయన పదవీ కాలంలో అనేక అవార్డులు, రివార్డులు పొందా రు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ఎస్పీ నారాయణ నాయక్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. సుబ్బరాజును ఏఆర్‌ డీఎస్పీ కృష్ణంరాజు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

Updated Date - 2020-10-12T17:03:39+05:30 IST