ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2020-10-29T05:06:28+05:30 IST
ఆశ వర్కర్ల సమస్యలు తక్షణమే పరి ష్కరించాలని సీఐటీయూ మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

పాలకొల్లు అర్బన్, అక్టోబరు 28 : ఆశ వర్కర్ల సమస్యలు తక్షణమే పరి ష్కరించాలని సీఐటీయూ మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మునిసిపల్ కార్యాలయం వద్ద బుధవారం ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టణ జనాభా నిష్పత్తికి అను గుణంగా ఆశాలను నియమించాలని, వార్డు సచివాలయాలకు ఆశాలను బదలాయించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు బి.జానకి, వై.వెంకటలక్ష్మి, పి.కృష్ణవేణి, డి.మంగమ్మ, సీహెచ్.స త్యవేణి పాల్గొన్నారు. మునిసిపల్ మేనేజర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.