ఆశ కార్యకర్తల అరెస్ట్‌ అన్యాయం

ABN , First Publish Date - 2020-11-04T04:56:28+05:30 IST

పాదయాత్రలో చేసిన వాగ్దానాలు అమలుచేయాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తే అరెస్టులు చేయడం అన్యాయ మని సీఐటీయూ మండల అధ్యక్షుడు పెంకి అప్పారావు అన్నారు.

ఆశ కార్యకర్తల అరెస్ట్‌ అన్యాయం
ఆకివీడులో ధర్నా చేస్తున్న ఆశ కార్యకర్తలు

ఆకివీడు, నవంబరు 3: పాదయాత్రలో చేసిన వాగ్దానాలు అమలుచేయాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తే అరెస్టులు చేయడం అన్యాయ మని సీఐటీయూ మండల అధ్యక్షుడు పెంకి అప్పారావు అన్నారు. అరెస్ట్‌లకు నిరసనగా మాదివాడ సచివాలయం వద్ద ఆశ కార్యకర్తలు మంగళవారం ధర్నా నిర్వహించారు. ప్రాణాలకు తెగించి కరోనా కాలంలో కూడా విధులు నిర్వహించారన్నారు. అర్హులకు సంక్షేమ పధకాలు అమలు చేయాలని, ఆశాలను సచివాలయాలకు అనుసంధానం చేయొద్దని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అమలు చేయాలన్నారు. మూడేళ్ల యూనీఫాం వెంటనే ఇవ్వాలన్నారు. రూ. 10వేల వేతనం ఒకేసారి చెల్లించాలన్నారు. అధికారుల వేధింపులు తగదన్నారు. కా  ర్యక్రమంలో పద్మ, సుబ్బలక్ష్మి, విజయలక్ష్మి, మార్త, రమ్య, సౌందర్య, బేబీసరోజని తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-11-04T04:56:28+05:30 IST