-
-
Home » Andhra Pradesh » West Godavari » aruna prasad
-
ప్రముఖ శిల్పి అరుణ ప్రసాద్ మృతి
ABN , First Publish Date - 2020-11-26T04:58:12+05:30 IST
శిల్పాలకు జీవ కళ తెచ్చే ప్రముఖ శిల్పి డాక్టర్ పెనుగొండ అరుణ ప్రసాద్ (47) బుధవారం మృతి చెందారు.

పెనుమంట్ర, నవంబరు 25 : శిల్పాలకు జీవ కళ తెచ్చే ప్రముఖ శిల్పి డాక్టర్ పెనుగొండ అరుణ ప్రసాద్ (47) బుధవారం మృతి చెందారు. ఆయన కరోనా బారినపడడంతో రాజమహేంద్రవరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. మండలంలోని నత్తారా మేశ్వరంలో ఏకే ఆర్ట్స్ పేరుతో విగ్రహాలను రూపకల్పన చేసేవారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు, తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి అరుణ ప్రసాద్, శిల్పకళారంగంలో ప్రపంచ ఖ్యాతిగాంచిన రోబో టెక్నాలజీని అందిపుచ్చుకుని వైశ్యుల ఆరాధ్య దైవం వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి 90 అడుగుల పంచలోహ విగ్రహాన్ని రూపొందిం చారు. మాజీ ముఖ్యమంత్రులు కొణిజేటి రోశయ్య, చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు వంటివారు అరుణ ప్రసాద్ శిల్ప నైపుణ్యానికి ముగ్ధులయ్యారు. ఏకే ఆర్ట్స్ సంస్థ ద్వారా హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంలో బ్రాంచిల ద్వారా తన నైపుణ్యాన్ని అందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన రూపొందించిన విగ్రహాలు కనిపిస్తాయి. అరుణ ప్రసాద్ మృతితో నత్తారామే శ్వరం గ్రామంలో విషాదం అలుముకుంది. అందరినీ అప్యాయంగా పలకరిం చే అరుణప్రసాద్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతికి వైసీపీ నాయకులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.