కళ తప్పింది

ABN , First Publish Date - 2020-08-22T11:03:09+05:30 IST

కరోనా వైరస్‌ ప్రభావం వినాయక ఉత్సవాలపై పూర్తిగా పడింది. ఉత్స వాల ప్రారంభానికి పది రోజుల ముందుగానే అన్ని గ్రామాల్లో పండుగ సందడి కనిపించేది

కళ తప్పింది

 వినాయక చవితిపై కరోనా ప్రభావం

మార్కెట్‌లలో అరకొరగా దుకాణాల ఏర్పాటు

పండ్లు, పువ్వుల ధరలకు రెక్కలు:  

కరోనా వైరస్‌ ప్రభావం వినాయక ఉత్సవాలపై పూర్తిగా పడింది. ఉత్స వాల ప్రారంభానికి పది రోజుల ముందుగానే అన్ని గ్రామాల్లో పండుగ సందడి కనిపించేది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో వినాయకచవితి సామూహిక ఉత్సవాల నిర్వహణ ఎక్కడా కనిపించలేదు. మార్కెట్‌లలో కూడా దుకాణాలు పెద్దగా ఏర్పాటు చేయలేదు.  పత్రి, పూలు పండ్ల దుకాణాలు అతి తక్కువ మాత్రమే వెలిశాయి. పత్రికి డి మాండ్‌ పెరిగింది.


దీంతో ధరలు అకాశాన్నంటాయి.  కర్పూర అరటి పం డ్లు డజను రూ. 40-50, చామంతి కిలో రూ.250-300, బంతి రూ.180 వరకు విక్రయాలు చేశారు.  కొద్దిపాటి దుకాణాల వద్దే జనం కరోనాను మరిచి భౌతికదూరం పాటించకుండా గుమ్మిగూడారు. మరోవైపు మట్టి వినాయకులనే పూజించాలంటూ  జిల్లా వ్యాప్తంగా పలు  ప్రాంతాల్లో వివిధ సంస్థలు, దాతలు మట్టి గణనాథుడి ప్రతిమలను పంపిణీ చేశారు.


  నిడదవోలులో వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో,  పాలకోడేరు మండలం పెన్నాడలో స్పందించే హృదయం స్వచ్ఛందసేవా సంస్థ, తాడేపల్లిగూడెం 29వ వార్డులో పేరిచర్ల ఫౌండేషన్‌, తణుకు పతంజలి షాపు వద్ద పతంజలి యోగా కల్చరల్‌ ట్రస్టు యోగా గురువు కర్రి శ్రీనివాసరెడ్డి,  చిరంజీవి ఫ్యాన్స్‌ ఆధ్వర్యంలో,  జేడీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అన్నవరప్పాడు, పెరవలి, తణుకు, తదితర ప్రాంతాల్లో , కొయ్యలగూడెంలో రోటరీ క్లబ్‌  ఆధ్వర్యంలో  మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.

Updated Date - 2020-08-22T11:03:09+05:30 IST