-
-
Home » Andhra Pradesh » West Godavari » arrest
-
ఆర్‌ఎస్‌ఐపై దాడి కేసులో 11 మంది అరెస్టు
ABN , First Publish Date - 2020-11-01T05:07:30+05:30 IST
బాలికను వేధించిన కేసులో, ఆర్‌ఎస్‌ఐపై దాడి చేసిన కేసులో 11 మందిని ఏలూరు త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏలూరు క్రైం, అక్టోబరు 31 : బాలికను వేధించిన కేసులో, ఆర్‌ఎస్‌ఐపై దాడి చేసిన కేసులో 11 మందిని ఏలూరు త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు ఏటిగట్టు ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను వేధించిన యువకులను మంద లించిన ఆర్‌ఎస్‌ఐపై ఒక ప్రజాప్రతినిధి అనుచరులు దాడిచేసిన సంఘటనలపై ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదు చేశారు. ప్రధాన నిందితులైన పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామానికి చెందిన గడ్డం నాగేంద్ర, మేరుగు రాజేష్, గడ్డం సహదేవుడు, గడ్డం చింటు, మేరుగు చంటి, పరిమి రమేష్, పరిమి హరీష్, గరికముక్కు చిన్ని, మత్తే రాము, మత్తే గణేష్, పిట్టా మనోజ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ఏలూరు సెకండ్ ఏజెఎస్‌ఎం కోర్టులో హాజరు పర్చగా 14 రోజులు రిమాండ్ విధించారు. భీమవరం సబ్ జైలుకు తరలించారు.