-
-
Home » Andhra Pradesh » West Godavari » arrest
-
హౌస్ అరెస్ట్
ABN , First Publish Date - 2020-11-01T05:04:50+05:30 IST
అమరావతి రైతుల చేతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ అమరావతి పరిరక్షణ సమితి ఇచ్చిన ‘చలో జైల్ భరో’ కార్యక్రమానికి వెళ్లకుండా టీడీపీ నేతలను పోలీసులు శనివారం ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

టీడీపీ నేతల గృహ నిర్బంధం
‘గుంటూరు జైల్‌భరో’కు వెళ్లకుండా అడ్డగింత
ఏలూరు, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): అమరావతి రైతుల చేతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ అమరావతి పరిరక్షణ సమితి ఇచ్చిన ‘చలో జైల్ భరో’ కార్యక్రమానికి వెళ్లకుండా టీడీపీ నేతలను పోలీసులు శనివారం ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, పట్ట ణాల్లో టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బం ధంలో ఉంచారు. ఉదయం అమరా వతికి బయలు దేరిన నరసాపురం, ఏలూరు, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు తోట సీతా రామలక్ష్మి, గన్ని వీరాంజనేయులు, కేఎస్ జవహర్‌ను పోలీసులు అడ్డుకుని గృహనిర్బంధంలో ఉంచారు. పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, జిల్లా కార్యదర్శి గౌరు నాయుడులను ఇంటికే పరిమితం చేశారు. కాళ్లలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఆయన అను చరులను పోలీసులు ఇల్లు కదలనీయలేదు. నరసా పురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు,దేవరపల్లిలో గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, చింతలపూడిలో టీడీపీ కన్వీ నర్ కర్రా రాజారావు, పోలవరంలో నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్, తాడేపల్లిగూడెంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్, భీమవరం ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, ఆర్టీసీ మాజీ రీజనల్ చైర్మన్ మెంటే పార్థసారఽథి, ఆకివీడులో ఏఎంసీ మాజీ చైర్మన్ మోటుపల్లి రామవరప్రసాద్ సహా వీరవాసరంలోని పలువురు టీడీపీ ముఖ్య నేత లను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. జంగారెడ్డిగూడెం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత మాజీ అధ్యక్షుడు పెనుమర్తి రామకుమార్, పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్ ముస్తఫాలను కార్య కర్తలను పోలీసులు నిర్బంధించారు.

