పదికి..పరీక్ష.. విద్యార్థుల గ్రేడింగ్‌పై కసరత్తు

ABN , First Publish Date - 2020-06-26T21:51:21+05:30 IST

కరోనా ప్రభావం కార ణంగా పదో తరగతి పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులుగా ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో జిల్లాలో మొత్తం 50,027 మంది ఉత్తీర్ణులయ్యారు. వారందరికీ మార్కులు

పదికి..పరీక్ష.. విద్యార్థుల గ్రేడింగ్‌పై కసరత్తు

సమ్మేటివ్‌, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ మార్కులే ఆధారం

ఎఫ్‌ఏ-4 మార్కులు గతంలో నమోదు కాలేదు

ప్రస్తుతం ఆన్‌లైన్‌ చేయాలంటూ ఉత్తర్వులు


ఏలూరు ఎడ్యుకేషన్‌(ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావం కార ణంగా పదో తరగతి పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులుగా ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో జిల్లాలో మొత్తం 50,027 మంది ఉత్తీర్ణులయ్యారు. వారందరికీ మార్కులు, గ్రేడులు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. గ్రేడింగ్‌ ఇవ్వడానికి అంతర్గత పరీక్షల (ఎఫ్‌ఎ, ఎస్‌ఎ) మార్కులు ప్రామాణికం. అంతర్గత పరీక్షల మార్కులు కొన్ని ఆన్‌లైన్‌లో నమోదు కాగా ఎఫ్‌ఏ 4 మార్కులు నమోదు కాలేదు. ప్రస్తుతం నమోదుకు అవకాశం కల్పించడం గ్రేడింగ్‌కు కీలకం కాను ంది. మార్కుల ఆన్‌లైన్‌ నమోదు కొన్ని చోట్ల అడ్డకోలుగా తయారైందని ఆరోపణలు వస్తున్నాయి.


విద్యా సంవత్సరంలో మొత్తం నాలుగు ఫార్మేటివ్‌, ఒక సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన సామర్థ్యాలను, మార్కులను శుక్రవారం సాయంత్రంలోగా ఆన్‌లైన్‌ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. వీటిలో మూడు ఫార్మేటివ్‌, ఒక సమ్మేటివ్‌ (ఎస్‌ఎ-1) పరీక్షల మార్కులు ఇప్పటికే ఆన్‌లైన్‌ అయ్యాయి. ఎవరి మార్కులనైనా నమోదు చేయకపోయినా.. అనారోగ్య కారణాలతో తరువాత పరీక్ష రాసినా అటువంటి విద్యార్థుల మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు తాజాగా వెసులుబాటు కల్పించారు. ఏ విద్యార్థికైనా మార్కులు నమోదు చేయకుండా జీరోగా మార్కు చేసి ఉంటే వారికి మళ్లీ ఇప్పుడు సంబంధిత సబ్జెక్టు పరీక్ష నిర్వహించడం లేదా కనీస పాస్‌ మార్కులు అనుమ తించడం చేస్తున్నారు.


ఇప్పటికే సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో మార్కుల నమోదుచేసి ఉంటే వాటిని మార్చేందుకు (ఎడిట్‌కు) అవకాశం లేకుండా ఒకింత అక్రమాలకు చెక్‌ పెట్టారు.కానీ పది పరీక్షల్లో అంతర్గత మార్కులను ఎత్తి వేస్తున్నట్టు ప్రభుత్వం విద్యా సంవత్సరం మధ్యలో ప్రకటించ డంతో పలు ప్రైవేటు పాఠశాలల్లో ఎఫ్‌ఏ, ఎస్‌ఏ పరీక్షల మార్కులను అసలు ఆన్‌లైన్‌ నమోదు చేయలేదు. ఆయా పాఠశాలలన్నీ తాజా వెసులుబాటును ఉపయోగించుకుని ఇష్టానుసారం గరిష్ఠ మార్కులను సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లైందని విమ ర్శలు వస్తున్నాయి. ఫలితంగా ప్రతిభ గల విద్యార్థులకు అంతర్గత పరీక్షల ఆధారంగా ఇచ్చే మార్కులు, గ్రేడుల విషయంలో అన్యాయం జరిగే అవకాశాలు లేకపోలేదు. కాగా ఇంత వరకూ ఆన్‌లైన్‌ చేయని ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఎ-4) మార్కుల నమోదుకు బుధ, గురువారాల్లో ప్రధా నోపాధ్యాయులు ఎంత కుస్తీ పట్టినా సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో ఎఫ్‌ఎ-4 మార్కుల నమోదు లింకు ఓపెన్‌కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదైన మూడు ఎఫ్‌ఏలు, ఎస్‌ఏ-1 పరీక్షలనే ప్రామాణికంగా తీసుకుంటారా లేక ఎఫ్‌ఏ-4ను కూడా కలిపి గ్రేడులు ప్రకటిస్తారా అనే విషయంపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Updated Date - 2020-06-26T21:51:21+05:30 IST