శివరాత్రి ఏర్పాట్లపై అధికారుల సమీక్ష
ABN , First Publish Date - 2020-02-05T21:31:08+05:30 IST
శివరాత్రి ఏర్పాట్లపై అధికారుల సమీక్ష

పట్టిసం క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఐ అల్లు నవీన్ నరసింహమూర్తి అన్నారు. పట్టిసీమ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయ ఆవరణలో మంగళవారం జరిగిన ఉత్సవ ఏర్పాట్ల సమీక్ష సమేవేశంలో ఆయన మాట్లాడారు.
నది దాటించడంలో అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీస్ శాఖ తరపున పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. తహసీల్దారు సీహెచ్.నరసింహమూర్తి, వివిధ శాఖల అధికారు లు చేపట్టనున్న పనుల గురించి వివరించారు. ఉత్సవ పోస్టర్ అధికారులు ఆవిష్కరించారు.