పాలిటెక్నిక్‌ అధ్యాపక పరీక్షలకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-03-12T08:35:21+05:30 IST

పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి గురువారం నుంచి ప్రారంభం కానున్న ఆన్‌లైన్‌ పరీక్షకు పకడ్బంధీగా

పాలిటెక్నిక్‌ అధ్యాపక పరీక్షలకు ఏర్పాట్లు

ఏలూరు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి గురువారం నుంచి ప్రారంభం కానున్న ఆన్‌లైన్‌ పరీక్షకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేశామని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి బుధవారం తెలిపారు. ఈ నెల 12వ తేదీ పారంభమై 15వ తేదీ వరకూ ఆన్‌లైన్‌ పద్ధతిలో జరిగే ఈ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం  12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం  5.30 గంటల వరకు జరుగు తుందని చెప్పారు. అభ్యర్థులందరూ 45 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. భీమవరం డీఎన్నార్‌ ఇంజనీరింగ్‌ కాలేజి, విష్ణు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఏలూరు పరిధిలోని రామచంద్ర ఇంజనీరింగ్‌ కాలేజి, ఏలూరు ఇంజనీ రింగ్‌ కాలేజీలలో పరీక్షలు ఉంటాయని తెలిపారు. 

Updated Date - 2020-03-12T08:35:21+05:30 IST