సాయుధ దళాల జెండా దినోత్సవం

ABN , First Publish Date - 2020-12-08T04:22:33+05:30 IST

డీఎన్నార్‌ కళాశాల సీనియర్‌ డివిజన్‌ ఎన్‌సీసీ కాడెట్లు ఆధ్వర్యంలో సాయుధ దళాల జెండా దినోత్సవం సోమవారం నిర్వహించారు.

సాయుధ దళాల జెండా దినోత్సవం
ర్యాలీ ప్రారంభిస్తున్న కళాశాల కార్యదర్శి గాదిరాజు బాబు

భీమవరం ఎడ్యుకేషన్‌, డిసెంబరు 7 : డీఎన్నార్‌ కళాశాల సీనియర్‌ డివిజన్‌ ఎన్‌సీసీ కాడెట్లు ఆధ్వర్యంలో సాయుధ దళాల జెండా దినోత్సవం సోమవారం నిర్వహించారు. పుర వీధులగుండా భారీ జనచైతన్య ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కళాశాల పాలకవర్గ కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో సైనికుల సేవలు వెల కట్టలేనివన్నారు. కళాశాల పరిపాలనాధికారి పి రామకృష్ణంరాజు మాట్లాడుతూ సైనిక సంక్షేమ నిధికి ప్రజలందరూ విరాళాలు ఇవ్వవలసిన అవసరం ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ బీఎస్‌.శాంతకుమారి, ఎన్‌సీసీ ఆఫీసర్‌ కెప్టెన్‌ వీరయ్య మాట్లాడారు. సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎంబి.భాస్కరరాజు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, సీనియర్‌ కాడెట్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-08T04:22:33+05:30 IST