అయ్యప్ప సన్నిధిలో అరవణ ప్రసాదం

ABN , First Publish Date - 2020-11-08T04:53:36+05:30 IST

గుర్వాయిగూడెం అయ్యప్పస్వామి ఆలయంలో అరవణ ప్రఽసాదాన్ని శనివారం నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చా మని .ఆలయ అభివృద్ది కమిటీ చైర్మన్‌ చామర్తి శ్రీరాములు తెలిపారు.

అయ్యప్ప సన్నిధిలో అరవణ ప్రసాదం
అయ్యప్పస్వామి ఆలయంలో భక్తులకు అరవణ ప్రసాదం అందజేత

జంగారెడ్డిగూడెం, నవంబరు 7:గుర్వాయిగూడెం అయ్యప్పస్వామి ఆలయంలో అరవణ ప్రఽసాదాన్ని శనివారం నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చా మని .ఆలయ అభివృద్ది కమిటీ చైర్మన్‌ చామర్తి శ్రీరాములు తెలిపారు. శబరిమలైలో ప్రీతికరమైన ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేసి ప్రతీ రోజు భక్తులకు అందజేస్తామన్నారు. అంకంపాలెం నుంచి స్వాములు 41 రోజుల దీక్ష పూర్తి చేసుకుని ఏలూరు గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడులు సమర్పిం చారు. ట్రస్టు సభ్యులు గంగు జగన్మోహనరెడ్డి, నెక్కలపూడి సూర్యచంద్రరావు, రొక్కం స్వామి, అంజి స్వామి పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-08T04:53:36+05:30 IST