ఆక్వా ఉత్పత్తిలో అద్వితీయం : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-11-22T05:07:59+05:30 IST

మత్య్సకారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికా భివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు పేర్కొన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరిం చుకుని శనివారం కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆక్వా ఉత్పత్తిలో అద్వితీయం : కలెక్టర్‌
ఆక్వా రంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీల బ్రోచర్‌ను విడుదల చేసిన కలెక్టర్‌

   ఏలూరు ఫైర్‌స్టేషన్‌, నవంబరు 21: మత్య్సకారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికా భివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు పేర్కొన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరిం చుకుని శనివారం కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.జిల్లాలో 69,200 హెక్టార్లలో ఆక్వా సాగు జరుగుతుందన్నారు.చేపల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే జిల్లా రెండో స్థానంలో ఉందన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి 13,21,675 టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకూ 9,58,184 టన్నుల చేపల ఉత్పత్తి జరిగిందన్నారు. చేపల ఉత్పత్తి వల్ల రూ.11,780 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. నరసాపురం మండలం బియ్యపుతిప్ప గ్రామం వద్ద ఫిష్‌ లాండింగ్‌ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే ఏకైక ఆక్వా యూనివర్శిటీ జిల్లాకు మంజూరైందన్నారు. 3,043 మంది రైతులకు సాగు ధ్రువీకరణ పత్రాలు అందజేశా మన్నారు. చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో అందిస్తున్నా మన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.వెం కట రమణారెడ్డి, రాష్ట్ర మత్స్యశాఖ డైరె క్టర్‌ ఉమా శంకర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ కె.చంద్రశేఖర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వేముల తిరుపతయ్య, మత్స్య సహకార సంఘం సమాఖ్య జిల్లా అధ్యక్షుడు అండ్రాజు చల్లారావు, డైరెక్టర్‌ టి.సీతామహాలక్ష్మి, ఎన్‌.భానుమూర్తి పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-22T05:07:59+05:30 IST