సిగ్రాస్ టెక్‌తో ఏపీ నిట్ ఒప్పందం
ABN , First Publish Date - 2020-12-12T04:25:26+05:30 IST
ఏపీ నిట్‌తో సిగ్రాస్ టెక్ ప్రైవేటు లిమి టెడ్ శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది.
తాడేపల్లిగూడెం రూరల్, డిసెం బరు 11 : ఏపీ నిట్‌తో సిగ్రాస్ టెక్ ప్రైవేటు లిమి టెడ్ శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఒప్పందపత్రాలను నిట్ ప్రాం గణంలో డైరెక్టర్ సూర్య ప్రకా శరావు, సిగ్రాస్ సంస్థ డైరెక్టర్ మోనిషా రెడ్డి విడుదల చేశారు. సిగ్రాస్ సంస్థ, ఏపీ నిట్ కలిపి సమాజానికి ఉపయోగకరమైన సాంకేతి కతను అభివృద్ధి చేయడానికి ఒప్పందం దోహ దపడుతుంది. దీంతో పాటు ఎంటెక్, బీటెక్ విద్యార్థులకు ఇంటర్నర్‌షిప్ ఇవ్వడానికి ఆసక్తి కనబర్చింది. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు డాక్టర్ పి.దినేష్ శంకరరెడ్డి, డాక్టర్ సుదర్శన్ దీప పాల్గొన్నారు.