అభ్యసన పూర్వక విద్యతోనే విజ్ఞానం : నిట్‌ డైరెక్టర్‌

ABN , First Publish Date - 2020-12-02T04:37:55+05:30 IST

అభ్యసన పూర్వక విద్యతోనే విజ్ఞానం పెంపొందుతుందని నిట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సూర్యప్రకాశ రావు తెలిపారు.

అభ్యసన పూర్వక విద్యతోనే విజ్ఞానం : నిట్‌ డైరెక్టర్‌
మాట్లాడుతున్న నిట్‌ డైరెక్టర్‌ సూర్యప్రకాశరావు

తాడేపల్లిగూడెం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి) : అభ్యసన పూర్వక విద్యతోనే విజ్ఞానం పెంపొందుతుందని నిట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సూర్యప్రకాశ రావు తెలిపారు. ఏపీ నిట్‌లో మొదటి సంవత్సర విద్యార్థులకు బుధవారం వర్చువల్‌ తరగతులను ప్రారంభించారు. డిసెంబరు 12వ తేదీ వరకు ఇంజనీరింగ్‌ విద్యపై అవగాహన కల్పిస్తామన్నారు. బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ చైర్మన్‌ మృదుల రమేష్‌ ఆన్‌లైన్‌లో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిం చేందుకు ఏపీ నిట్‌ సిద్ధంగా ఉందని తెలిపారు. విద్యార్థులను ఉన్నతలుగా తీర్చిదిద్దేందుకు ఏపీ నిట్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.  కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ రిజిస్ర్టార్‌ దినేష్‌ శంకర్‌ రెడ్డి, అకడమిక్‌ అఫైర్స్‌ డీన్‌ కొమరయ్య, స్టూడెంట్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రొఫెసర్‌ జీవీ.వీరేష్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T04:37:55+05:30 IST