ద్వారకాతిరుమల ఈవోగా భ్రమరాంబ

ABN , First Publish Date - 2020-09-21T11:47:54+05:30 IST

ద్వారకాతిరుమల ఈవోగా భ్రమరాంబ

ద్వారకాతిరుమల ఈవోగా భ్రమరాంబ

ద్వారకాతిరుమల, సెప్టెంబరు 20 : ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నూతన ఈవోగా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన డి.భ్రమరాంబ అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని అనంతరం కార్యా లయానికి వెళ్లి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న ఈవో ప్రభాకరరావు రెవెన్యూ శాఖకు బదిలీ అయ్యారు. భ్రమరాంబ రాజమండ్రి ఆర్‌జేసీగా పనిచేస్తూ ఈవోగా ఇక్కడ నియమితులయ్యారు. 

Updated Date - 2020-09-21T11:47:54+05:30 IST