కార్మిక సమస్యల పరిష్కారానికి బలమైన ఉద్యమం అవసరం

ABN , First Publish Date - 2020-11-01T05:26:07+05:30 IST

శత వసంతాల పోరాట స్పూర్తితో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బలమైన ఉద్యమం చేపట్టాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు దూసనపూడి సోమసుందర్‌ అన్నారు.

కార్మిక సమస్యల పరిష్కారానికి బలమైన ఉద్యమం అవసరం
నిడదవోలులో ఏఐటీయూసీ శతాబ్ది వారోత్సవాల సందర్భంగా పతాక ఆవిష్కరణ చేసి మాట్లాడుతున్న జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖా భాస్కరరావు

ఏఐటీయూసీ శత వసంతాల వేడుకలు

తాడేపల్లిగూడెం రూరల్‌/ నిడదవోలు/ ఇరగవరం/ తణుకు టౌన్‌ అక్టోబరు 31: శత వసంతాల పోరాట స్పూర్తితో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బలమైన ఉద్యమం చేపట్టాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు దూసనపూడి సోమసుందర్‌ అన్నారు. ఏఐటీయూసీ శతాబ్ది ఉత్సవాల సందర్భరంగా వేర్వేరు ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు. తాడేపల్లి గూడెంలో సీనియర్‌ కార్మిక నేతలు సిద్దన జగన్నాధం, ఏఎస్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ ప్రసాద్‌, ఎర్రగోగుల వీర్రాజు, అల్లం కృష్ణవేణి, పాపమ్మ, కొల్లి సుదేశరావు, మాదాసు సత్యనారాయణ, దాసరి వెంకన్నలను సత్కరించారు. నిడద వోలులో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖా భాస్కరరావు పతాకాన్ని ఆవిష్కరించారు. మాట్లాడుతూ ప్రసుత్తం దేశంలో కొనసాగుతున్న మతోన్మాద శక్తుల పాలన నుంచి దేశాన్ని రక్షించు కోవలసిన బాధ్యత కార్మిక వర్గానిదే అని అన్నారు. కార్మిక నిర్బంధ వైఖరికి నిరసనగా చట్టాల పరిరక్షణకు ఎఐటీయూసీ నాయకత్వంలో మరిన్ని సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వంద మోటారు సైకిళ్ళతో ర్యాలీ నిర్వహించారు. మాముడూరి నాగేంద్రవరప్రసాద్‌, నాగదేవ్‌, మొయిలి శ్రీను, రామిశెట్టి సత్తిబాబు, కోసూరి శ్రీను తదితర్లు పాల్గొన్నారు.  ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు గ్రామ శాఖ ఆధ్వర్యంలో సీపీఐ మండల కార్యదర్శి నామన వెంకటేశ్వరరావు జెండా ఆవిష్కరించారు.గిద్దా సూర్యనారాయణ, అడ్డాల సత్యనారాయణ, శ్రీను, కోటిపల్లి సత్యనారాయణ, ములగాల కృష్ణ, గుడిమెట్ల కోటేశ్వరరావు, అంజి పాల్గొన్నారు. కార్మిక హక్కులు, చట్టాల సాధనలో ఏఐటీయూసీ కృషి  ఎనలేనిదవని రాష్ట్ర కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. తణుకులో పలుచోట్ల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పతాకాలు ఆవిష్కరించారు. సీపీఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, ఏరియా కార్య దర్శి సికిలే పుష్పకుమారి, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యింటి వీరన్న, జిల్లా అధ్యక్షుడు గండి రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు, అక్క మాంబ టెక్స్‌టైల్స్‌ కార్మికసంఘం కార్యదర్శి గొల్లపల్లి కనకారావు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-01T05:26:07+05:30 IST