విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి

ABN , First Publish Date - 2020-02-08T12:22:09+05:30 IST

పొలం పనికి వెళ్ళిన వ్యక్తి వి ద్యుదాతానికి గురి కావడంతో మృత్యువాత పడ్డాడు. ద్వారకా తిరు మల మండలం తిరుమ లంపాలెం గ్రామానికి చెందిన

విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి

ఏలూరు క్రైం, ఫి బ్రవరి 7 : పొలం పనికి వెళ్ళిన వ్యక్తి వి ద్యుదాతానికి గురి కావడంతో మృత్యువాత పడ్డాడు. ద్వారకా తిరు మల మండలం తిరుమ లంపాలెం గ్రామానికి చెందిన మందపాటి ఏసు అదే గ్రామంలోని ఒక రైతు పొలంలో నీళ్లు పెట్టడానికి వెళ్ళాడు. ఆ పొలంలోని విద్యుత్‌ వైరు తగలడంతో తీవ్ర గాయాలకు గురయ్యాడు. అతడిని ఏలూరు ప్రభుత్వా సుపత్రికి తరలించగా ఆసుపత్రి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మందపాటి ఏసు మృతిపై ఆసుపత్రి వైద్యులు ఎమ్మెల్సీగా నమోదు చేసి ఆసుపత్రి ఔట్‌పోస్టు వైద్యులకు సమచారం ఇచ్చారు. మృత దేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

Updated Date - 2020-02-08T12:22:09+05:30 IST