అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ఉండాలి

ABN , First Publish Date - 2020-11-26T05:19:16+05:30 IST

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ఉండాలి

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ఉండాలి

కొవ్వూరు నవంబరు 25:అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరికి అవగాహ న ఉండాలని కొవ్వూరు అగ్నిమాపక శాఖ అధికారి కౌరు సత్యానందం సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్‌, అల్లూరి నాగరత్నం జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల, కుమారదేవం ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్సియల్‌ పాఠశాలలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. విద్యార్థులను ఫైర్‌ రెస్క్యూ టీమ్‌, మీడియా టీమ్‌, ఫస్ట్‌ ఎయిడ్‌ టీమ్‌, ఫైర్‌ ఫైటింగ్‌ టీమ్‌లుగా విభజించి ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించి విద్యార్థులకు వివరించారు.

Read more