‘చదువంటే మాకిష్టం’తో పఠనాసక్తి పెంపు

ABN , First Publish Date - 2020-11-28T05:02:54+05:30 IST

విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకే ‘చదువంటే మాకిష్టం’ కార్యక్రమాన్ని చేపట్టామని పాఠశాల విద్య అదనపు డైరెక్టర్‌ పయ్యావుల పార్వ తి అన్నారు.

‘చదువంటే మాకిష్టం’తో పఠనాసక్తి పెంపు

పాఠశాల విద్య అదనపు డైరెక్టర్‌ పార్వతి

ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 27: విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకే ‘చదువంటే మాకిష్టం’ కార్యక్రమాన్ని చేపట్టామని పాఠశాల విద్య అదనపు డైరెక్టర్‌ పయ్యావుల పార్వ తి అన్నారు. జిల్లాలో విద్యాకానుక వా రోత్సవాల నిర్వహణను పరిశీలించేందుకు శుక్రవారం విచ్చేసిన ఆమె ఏలూరులోని పన్నెండు పంపుల స్కూలు, సెయింట్‌ థెరిస్సా బాలికోన్నత పాఠశాల, సుబ్బమ్మదేవి మునిసిపల్‌ హైస్కూళ్లను సందర్శించారు. తరగతుల నిర్వహణ, పాఠ్యాంశాల గురిం చి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యాకానుక కిట్లు అందిందీ, లేనిదీ ప్రశ్నిం చారు. కిట్లలోని వస్తువుల నాణ్యతను పరిశీలించారు. పాఠ్య ప్రణాళిక అమలుపై ఉపాధ్యాయులతో సమావేశమై సూచనలు చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. సెప్టెంబరు, అక్టోబరు నెలలకు సంబంధించి విద్యార్థులందరికీ డ్రైరేషన్‌ పంపిణీపై ఆరా తీశారు. డైరెక్టర్‌ వెంట డీఈవో సీవీ రేణుక, నగర పాఠ శాలల డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ డి.సాంబశివరావు, సమగ్ర శిక్ష సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2020-11-28T05:02:54+05:30 IST