పోలీస్, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2020-06-18T11:00:58+05:30 IST
బుట్టాయిగూడెం మండలం పద్మవారి గూడెంలో గిరిజనులపై అన్యాయంగా లాఠీఛార్జి చేసి, గిరిజన మహిళ పట్ల అమానుషంగా
ఏలూరు కలెక్టరేట్, జూన్ 17 : బుట్టాయిగూడెం మండలం పద్మవారి గూడెంలో గిరిజనులపై అన్యాయంగా లాఠీఛార్జి చేసి, గిరిజన మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించిన స్థానిక పోలీస్, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని, గిరిజను లపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎ.రవి, నగర కార్యదర్శి పి.కిషోర్, డీఎన్‌వీడీ ప్రసాద్, గుడిపాటి నరసింహారావు, కె.శ్రీనివాస్, జె.హరీషాదుర్గా, పి.రామకృష్ణ, ఆది శేషు తదితరులు పాల్గొన్నారు.
భీమవరం అర్బన్ : జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులపై ప్రభుత్వం, పోలీసుల చేస్తున్న నిర్బంధాన్ని ఆపాలని సీపీఎం డెల్టా జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు. బుధవారం సీపీఎం ఆఫీసు ఎదురుగా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బి.బలరాం మాట్లాడుతూ చట్టపరంగా తమకు రావాల్సిన భూముల కోసం, హక్కుల కోసం, న్యాయం కోసం పోరాడుతున్న వారిపై నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని ఖం డించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జేఎన్‌వీ గోపాలన్, నాయకులు ఎం.వైకుంఠరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.