ప్రభుత్వ పాఠశాలలకు అక్రిడిటేషన్
ABN , First Publish Date - 2020-02-08T11:45:45+05:30 IST
సమగ్ర అభివృద్ధి సాధిం చిన ప్రభుత్వ పాఠశాలలకు అక్రిడిటేషన్ ఇచ్చేందుకు నిర్ణయించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ రూపొందించిన జాతీయ పాఠశాలల ప్రామాణికాలు, మదింపు కార్యక్ర

ఏలూరు ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 7 : సమగ్ర అభివృద్ధి సాధిం చిన ప్రభుత్వ పాఠశాలలకు అక్రిడిటేషన్ ఇచ్చేందుకు నిర్ణయించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ రూపొందించిన జాతీయ పాఠశాలల ప్రామాణికాలు, మదింపు కార్యక్రమం (ఎన్‌పీ ఎస్‌ఎస్‌ఈ)లో భాగంగా శాల-సిద్ధి పేరిట ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నిర్ణీత ప్రామాణికాల మేరకు అభివృద్ధి సాధించిన పాఠశాలలకు అక్రిడిటేషన్‌ను ఇవ్వను న్నారు.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ర్టేషన్ (ఎన్‌ఐఈపీఏ) నిర్దేశించిన ఏడు కీలక అంశాల్లో పాఠశాలలు సాధించిన అభివృద్ధిని గమనిస్తారు. శాల-సిద్ధి అమలుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈనెల 10వ తేదీన ఎంఈవోలు, మండలానికి ముగ్గురు చొప్పున రిసోర్సుపర్సన్లకు ఒరియంటేషన్ కార్యక్రమాన్ని డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే మండలస్థాయి ఒరియంటేషన్ ప్రోగ్రామ్‌ను ఈనెల 12వ తేదీన మండల కేంద్రాల్లో ప్రధానోపాధ్యాయులకు నిర్వహించనున్నారు.