-
-
Home » Andhra Pradesh » West Godavari » accident at denduluru west godavari dist
-
వాహనం ఢీకొని టీడీపీ నేత వీరభద్రయ్య మృతి
ABN , First Publish Date - 2020-12-11T05:12:42+05:30 IST
దెందులూరు మండలం మలకచర్ల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత పర్వతనే ని వీరభద్రయ్య (బజ్జీ) (68) గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు.

దెందులూరు, డిసెంబరు 10 : దెందులూరు మండలం మలకచర్ల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత పర్వతనే ని వీరభద్రయ్య (బజ్జీ) (68) గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. ఏలూరులో ఇటీవల మృతి చెందిన బంధువుల ఇంటికి వెళ్లి పరామర్శించి వ్యవసాయానికి కావలసిన పురుగు మందులను కొనుగోలు చేసి బుధవారం రాత్రి ఇంటికి మోటారు సైకిల్‌పై వస్తుండగా ఆశ్రం సమీపం లో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలు కా వడంతో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన పార్థీవ దేహాన్ని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాగంటి సురేంధ్రనాథ్ చౌదరి, ప్రముఖులు సందర్శించారు, కుటుంబ సభ్యులకు సానుభుతి తెలిపారు.