మృతదేహంతో ఆందోళన
ABN , First Publish Date - 2020-12-14T04:24:40+05:30 IST
కంటైనర్ ఢీకొని నాగిడిపాలెం మాజీ సర్పంచ్ మృతిచెందాడు.

కంటైనర్ ఢీకొని మాజీ సర్పంచ్ మృతి
న్యాయం చేయాలని రోడ్డుపై గ్రామస్థుల బైఠాయింపు
మొగల్తూరు, డిసెంబరు 13 : కంటైనర్ ఢీకొని నాగిడిపాలెం మాజీ సర్పంచ్ మృతిచెందాడు.భీమవరం మండలం నాగిడిపాలెంకు చెందిన తిరుమాని కిరణ్ కుమార్ (48) మాజీ సర్పంచ్‌గా పనిచేశారు. ప్రస్తుతం సరస్వతి ఇంగ్లీష్ మీడి యం స్కూల్‌కు కరస్పాండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఆదివారం మొగ ల్తూరు వచ్చి తిరిగి వెళుతుండగా కాళీపట్నం తూర్పు గ్రామంలో ఎదురుగా రొయ్యల లోడుతో వస్తున్న కంటైనర్ ఢీకొంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ మేరకు సమాచారం అందుకున్న బంధువుల సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. ఎస్‌ఐ ప్రియకుమార్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా ససేమిరా అన్నారు.ఆదివారం రాత్రి 9.30 గంటల తరువాత మృతుడి బంధువు తిరుమామి బాబ్జి హామీ మేరకు ఆందోళన విరమించారు.మృతుడికి భార్య వెంకటరమణ, కుమార్తె చంద్రిక ఉన్నారు.