మోటారు సైకిళ్లు ఢీకొని ఇద్దరికి గాయాలు
ABN , First Publish Date - 2020-11-04T04:37:11+05:30 IST
పొలమూరులో మలకావారి రామాలయం వద్ద మంగళ వారం మోటారు సైకిళ్లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు గాయపడ్డారు.
పెనుమంట్ర, నవంబరు 3 : పొలమూరులో మలకావారి రామాలయం వద్ద మంగళ వారం మోటారు సైకిళ్లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. పొలమూరు నుంచి బ్రాహ్మణ చెరువు వైపు వెళుతున్న స్కూటర్ ట్రాక్టర్‌ను తప్పించ బోయి ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దొడ్డి వెంకటరమణ తలకు తీవ్రగాయాలు అయ్యాయింద సంఘటన ప్రాంతం రక్తసిక్తమైంది. పెనుమంట్ర పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. క్షతగాత్రులను స్థానికులు ఆటోలో పెనుమం ట్రలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనతో తణుకు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తీసుకువెళ్లాలని వైద్యులు చెప్పారు. ఆ యువకుడిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకట రమణ ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారని బంధువులు తెలిపారు.