మహిళ మృతదేహం అప్పగింతకు గిరిజనుల వేడుకోలు

ABN , First Publish Date - 2020-06-23T10:57:47+05:30 IST

చనిపోయిన గిరిజన మహిళ మృత దేహాన్ని అప్పగించాలంటూ ఆమె బంధువులు వేడుకుంటున్నారు.

మహిళ మృతదేహం  అప్పగింతకు గిరిజనుల వేడుకోలు

బుట్టాయగూడెం, జూన్‌ 22: చనిపోయిన గిరిజన మహిళ మృత దేహాన్ని అప్పగించాలంటూ ఆమె బంధువులు వేడుకుంటున్నారు. వివ రాలిలా ఉన్నాయి. ఈనెల 10వ తేదీన మండలంలోని పెద్ద రవ్వారి గూడెంకు చెందిన తామా దుర్గమ్మ(48) అనే గిరిజన మహిళ వ్యక్తిగత పనుల నిమిత్తం కన్నాపురం వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా పులి రాముడు గూడెం రోడ్డులో గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొన డంతో తలకు తీవ్ర గాయమైంది. కన్నాపురంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రి లో ఆమెకు చికిత్స చేయించి ఇంటికి తీసుకువెళ్లి పోయారు.


వారం రోజులు ప్రతిరోజూ కన్నాపురం వచ్చి  వైద్యం చేయించుకున్న దుర్గమ్మ కు 17వ తేదీ రాత్రి ఫిట్స్‌ రావడంతో ఆమె భర్త 18వ తేదీన జంగా రెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షించి ఏలూరు ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. మరల ఏలూరు ఆస్పత్రి నుంచి గుం టూరు ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ దుర్గమ్మ 20వ తేదీ రాత్రి మరణించినట్టు భర్త బుచ్చిరాజు, బంధువులు తెలిపారు.


అయితే మృతదేహాన్ని  ఆస్పత్రి వర్గాలు సోమవారం కూడా అప్పగించలేదని, అదేమని అడిగితే పోస్టుమార్టం చేయాలని తెలిపారని, అనంతరం మృతురాలి కరోనా పరీక్ష రిపోర్టు రావలసి ఉందని, అది వచ్చిన వెంటనే మృత దేహాన్ని అప్పగిస్తామంటున్నారని తెలిపారు. మోటారు సైకిల్‌ ప్రమాదంలో గాయపడి చనిపోయిన దుర్గమ్మకు కరోనా పరీక్ష ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మృతురాలికి ముగ్గురు ఆడపి ల్లలు ఉన్నారు. గిరిజన మహిళ మృతదేహం బంధువులకు అప్పగించేం దుకు ఐటీడీఏ అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.  

Updated Date - 2020-06-23T10:57:47+05:30 IST