భార్యను హతమార్చిన నిందితుడికి జీవిత ఖైదు

ABN , First Publish Date - 2020-03-12T08:42:54+05:30 IST

భార్యపై అనుమానంతో హత్యచేసిన భర్తకు జీవిత ఖైదు, రూ.35 వేల జరిమానా విధిస్తూ ఏలూరులోని రెండో అదనపు జిల్లా

భార్యను హతమార్చిన నిందితుడికి జీవిత ఖైదు

ఏలూరు క్రైం, మార్చి 11: భార్యపై అనుమానంతో హత్యచేసిన భర్తకు జీవిత ఖైదు, రూ.35 వేల జరిమానా విధిస్తూ ఏలూరులోని రెండో అదనపు జిల్లా  సెషన్స్‌ జడ్జి పి.ప్రభాకరరావు బుధవారం తీర్పు చెప్పారు. నల్లజర్ల మండలం గుం డేపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి వెంకటేశ్వరరావు కుమార్తె సుబ్బలక్ష్మిని తూ ర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కోండ్రుకోట గ్రామానికి చెందిన మల్లారెడ్డి గంగాధర్‌ 2012లో ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.


గుండేపల్లి గ్రామానికి వచ్చి జీవిస్తున్నారు. భార్యపై తరచుగా అనుమానం పడుతు ఉండేవాడు. 2016 ఏప్రిల్‌ 24న గంగాధర్‌ కత్తితో సుబ్బలక్ష్మి గొంతులో పొడిచే శాడు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు నల్లజర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి తాడేపల్లిగూడెం సీఐ జీ.మధుబాబు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.


తరువాత సీఐ నాయక్‌ దర్యాప్తు చేసి ఛార్జిషీటు దాఖలు చేశారు. ఏలూరు రెండో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు, రూ.25 వేల జరిమానా, వరకట్న వేధింపులపై రెండేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు. ఏపీపీ రాంబాబు వాదించగా ప్రాసిక్యూషన్‌కు తాడేపల్లిగూడెం రూరల్‌ సీఐ వి.రవికుమార్‌, నల్లజర్ల ఎస్‌ఐ ఎ చంద్రశేఖరరావు, కోర్టు కానిస్టేబుల్‌ జీవీ.దుర్గారావు సహకరించారు.

Updated Date - 2020-03-12T08:42:54+05:30 IST