సమగ్ర విచారణ జరపాలి

ABN , First Publish Date - 2020-05-18T11:10:10+05:30 IST

నిబంధనలకు విరుద్ధంగా పాత పాఠశాల సామగ్రిని అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడి ఇంటికి

సమగ్ర విచారణ జరపాలి

పాఠశాల భవన సామగ్రి తరలింపుపై టీడీపీ నాయకుడు గోపాలరావు డిమాండ్‌ 


టి.నరసాపురం, మే 17: నిబంధనలకు విరుద్ధంగా పాత పాఠశాల సామగ్రిని అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడి ఇంటికి తరలించడంపై సమగ్ర విచారణ చేపట్టాలని టీడీపీ నాయకుడు మెతుకుమల్లి గోపాలరావు డిమాండ్‌ చేశారు. మక్కినవారిగూడెంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మక్కినవారిగూడెం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల పురాతన భవనం శిథిలం కావడంతో దానిని కూల్చేందు కు ఇంజనీరింగ్‌ అధికారులు రూ.38,500లతో అంచనా వేసినట్టు తెలిపారు. కూల్చిన భవనం సామగ్రి  ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేలం వేయాల్సి ఉండగా దానికి విరుద్ధంగా ఆ సామగ్రిని అధికార పార్టీ నాయకుడి ఇంటికి తరలించారన్నారు.


దీనిపై ఆరోపణలు రావడంతో అధికార పార్టీ నాయకుడి ఇంటికి తరలించిన సామగ్రిని స్థానిక రైతు భరోసా కేంద్రానికి తరలించార న్నారు. భవనం కూల్చినప్పుడు ఉన్న సామగ్రికి, ఆ నాయకుడి ఇంటి వద్ద నుంచి రైతు భరోసా కేంద్రానికి తరలించిన సామగ్రిలో వ్యత్యాసం ఉందని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవా లని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై ఎంపీడీవో కామేశ్వరిని వివరణ కోరగా పాత సామాగ్రి అధికార పార్టీ నాయకుడి ఇంటికి తరలించిన విషయం తన దృష్టికి రావడంతో ఆ మొత్తం సామగ్రిని ప్రభుత్వ కార్యాల యంలో లేదా రైతు  భరోసా కేంద్రంలో  భద్రపర్చాలని పంచాయతీ కార్య దర్శిని ఆదేశించినట్టు తెలిపారు. 


Updated Date - 2020-05-18T11:10:10+05:30 IST