అదనపు కట్నం కోసం వేధిస్తున్న వ్యక్తిపై కేసు
ABN , First Publish Date - 2020-03-16T11:47:21+05:30 IST
అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న వ్యక్తిపై రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. దీనికి సంబంధించి
తాడేపల్లిగూడెం క్రైం, మార్చి 15 : అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న వ్యక్తిపై రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొవ్వూరు మండలం వాడపల్లికి చెందిన రాచకొండ రమేశ్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. అతడితో మాధవరానికి చెందిన హరికకు 2019 ఫిబ్రవరిలో వివాహమైంది. వివాహ సమయంలో 20 లక్షల నగదు, అర ఎకరం పొలం, బంగారు ఆభరణాలు ఇచ్చారు. కొంతకాలం వారి కాపురం సాఫీగానే సాగింది. మామ, అత్త, ఆడపడుచుల మాటలు విని అదనంగా మరో రూ.5 లక్షల కట్నం కావాలని వేధిస్తుండటంతో హరిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.