932 కేసులు

ABN , First Publish Date - 2020-08-20T09:38:15+05:30 IST

జిల్లాలో కరోనా విజృంభిస్తూనే ఉంది. బుధవారం ఒక్కరోజే 932 కేసులు నమోదయ్యాయి. వీటిలో భీమవరంలో 131 కేసులు ఉన్నాయి. గడచిన వారం

932 కేసులు

జిల్లాలో మొత్తం 26,962

ఐదుగురు మృతి

ప్రజల్లో ఆందోళన


ఏలూరు, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి):జిల్లాలో కరోనా విజృంభిస్తూనే ఉంది. బుధవారం ఒక్కరోజే 932 కేసులు నమోదయ్యాయి. వీటిలో భీమవరంలో 131 కేసులు ఉన్నాయి. గడచిన వారంలో భీమవరంలో ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఇది రెండోసారి. ఆగస్టు 15న అత్యధి కంగా 137 కేసులు నమోదయ్యాయి. భీమవరం తర్వాతి స్థానాల్లో ఏలూరు 65, నరసాపురం 64, జంగారెడ్డిగూడెం 45, తణుకు 44, పాలకొల్లు 40, కొవ్వూరు 34, తాడేపల్లిగూడెం 33, నిడదవోలులో 33 చొప్పున కేసులు నమోదయ్యాయి.


నాలుగైదు రోజులుగా తక్కువ కేసులు నమోదవుతున్న జంగారెడ్డిగూడెం, కొవ్వూరులలో కేసుల సంఖ్య బుధవారం బాగా పెరిగింది. గ్రామీణ మండలాల్లో ఉంగుటూరు 35, పెనుగొండ 29, పెరవలి 28, దేవరపల్లి 27, నల్లజర్ల 24, పెదపాడు 22, చాగల్లు 22, గోపాలపురం 17, అత్తిలి 17, ఉండి 15, ఉండ్రాజవరం 14, పోడూరు 14, కొయ్యలగూడెం 13, యలమంచిలి 13, దెందులూరు 13, ఆచంట 12, భీమడోలు 12, పెనుమంట్ర 11, పెదవేగి 11, వీరవాసరం 10 చొప్పున కేసులు నమో దయ్యాయి.


వీటితోపాటు చింతలపూడి, ద్వారకా తిరుమల, పాలకోడేరు, పోలవరం, ఇరగవరం, లింగ పాలెం, పెంటపాడు, మొగల్తూరు, కామవరపుకోట, జీలుగుమిల్లి, కాళ్ల, నిడమర్రు మండలాల్లో పది లోపు కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా బారిన పడి ఐదుగురు మృతి చెందారు. 

Read more