31 నుంచి పది పరీక్షలు
ABN , First Publish Date - 2020-03-08T11:53:28+05:30 IST
స్థానిక సంస్థల ఎన్నికల భేరి మోగిన నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రీషెడ్యూల్ అయ్యాయి. తొలుత ఈ పరీక్షలను ఈనెల 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు నిర్వహించేందుకు

ఏలూరు ఎడ్యుకేషన్, మార్చి 7 : స్థానిక సంస్థల ఎన్నికల భేరి మోగిన నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రీషెడ్యూల్ అయ్యాయి. తొలుత ఈ పరీక్షలను ఈనెల 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను జారీ చేసిన విషయం విదితమే. తాజాగా సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు జరుగుతాయి. సవరించిన షెడ్యూల్‌ను డీఈవో సీవీ రేణుక శనివారం పత్రికలకు విడుదల చేశారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరుగుతాయి. ఈనెల 31న ప్రథమ భాష పేపర్-1 ఏప్రిల్ 1న పేపర్-2, 3న ద్వితీయ భాష పరీక్ష, 4న ఇంగ్లీషు పేపర్-1, 6న పేపర్-2, 7న గణితం పేపర్-1, 8న పేపర్-2, 9న జనరల్ సైన్సు పేపర్-1, 11న పేపర్-2, 13న సోషల్ స్టడీస్ పేపర్-1, 15న పేపర్-2, 16న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2, 17న ఒకేషనల్ కోర్సు థియరీ పరీక్షలు జరుగుతాయని వివరించారు.