-
-
Home » Andhra Pradesh » West Godavari » 28th collectorate at janasena darna west godavari dist
-
నేడు జనసేన ధర్నా
ABN , First Publish Date - 2020-12-28T05:36:00+05:30 IST
నివర్ తుఫాన్ రైతులకు తోణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు జనసేన ఏలూ రు ఇన్‌చార్జ్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు.

ఏలూరు కార్పొరేషన్, డిసెంబరు 27 : నివర్ తుఫాన్ రైతులకు తోణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు జనసేన ఏలూ రు ఇన్‌చార్జ్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఏలూరులో ఆదివారం ఆయన మాట్లాడుతూ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు, కార్యకర్తలు దీక్షలు చేసినప్పటికి ప్రభుత్వం స్పందించలేదన్నారు. దీంతో అధినేత ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. రైతులను సమాయత్తపరిచామని, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు హాజరవుతారని చెప్పారు.