వైరస్ దూకుడు
ABN , First Publish Date - 2020-07-10T11:14:11+05:30 IST
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గురువారం ఒక్కరోజే 163 కేసులు బయటపడ్డాయి. ఏలూరు..

పెరుగుతున్న కేసులతో ఆందోళన
ఒక్కరోజే 163 మందికి పాజిటివ్..ఏలూరులోనే 123
జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 2,353..
ఏలూరు, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గురువారం ఒక్కరోజే 163 కేసులు బయటపడ్డాయి. ఏలూరు నగరంలోనే 123 కేసులు నమోదయ్యాయి. ఏలూరు సుబ్బమ్మదేవి స్కూల్ రోడ్డు, సత్యనారాయణపేట, నవాబుపేట, ఎంఆర్సీ కాలనీ, ఇండియన్ గ్యాస్ గొడౌన్ వద్ద, బీడీ కాలనీ చెరువు గట్టు, చాణుక్యపురి కాలనీ 7వ రోడ్డు, శ్రీపర్రు, గుడివాడవారివీధి, కంకణాలవారివీధి, మాదేపల్లి, కందివారివీధి, యడ్లవారివీఽధి, కండివారి వీధి, రామకృష్ణాపురం, లక్ష్మీవారపుపేట, గవరవరం, భీమవరపు వారి వీధి, కనకం వారి వీధి, రజక వీధి, శాంతినగర్, శనివారపుపేట, ఆర్‌ఆర్‌పేట, పాలగూడెం, సీపీఐ కాలనీ, సబ్బుల వారి వీధి, గొర్రెల వారి వీధి, పాలతూము సెంటర్, గరుడ వారి వీధి, కంకణాల వారి వీధి, సబ్బవరపు వారి వీధి, శేఖర్ వారి వీధి, ఆండాళ్లమ్మ తోట, ఐఅండ్‌పీఆర్ కార్యాలయం, ఐకేపీ భవన్-2, చెంచుకాలనీ, మసీదు ఏరియాలలో 123 కేసులు నమోదయ్యాయి. కైకలూరులోని వెలమపేట, శేరేపాలెం, రామన్నపాలెం, శెట్టిపేట, కొవ్వూరు, భీమవరం 2వ వార్డు, భీమడోలు గణపతి సెంటర్లో ఒకొక్కటి చొప్పున పాజిటివ్ కేసులు గుర్తించారు.
దెందులూరు మండలం శ్రీరామవరంలో రెండు, తాడేపల్లిగూడెం విద్యుత్‌నగర్, 2వ వార్డులో మూడు కేసులు, పోడూరు మండలం జిన్నూరులో 8 కేసులతో పాటు, కాళీపట్టణం వెస్ట్‌లో మరో నాలుగు కేసులు నమోదైనట్లు నిర్ధారించారు. దెందులూరు మండలం పోతునూరు, గాలాయి గూడెం, చింతలపూడి మండంల రాఘవాపురం, రాజమండ్రి అన్నపూర్ణమ్మ పేటకు చెందిన మహిళకు, అత్తిలిలోని ఎన్టీయార్ నగర్, పాలకొల్లు, బంధంచర్ల, దెందులూరు, పాలకొల్లు బ్రాడీపేటలో ఐదు, పెదవేగి మండలం వేగివాడ, పెంటపాడు మండలం రాచర్లలో రెండు, భీమవరం మండలం చెరుకు వాడలో ఒకటి, తణుకు ఏడో వార్డు ఇందిరమ్మ కాలనీలో ఒకే కేసు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 2353కి చేరింది.
మరిన్ని కంటైన్మెంట్లు :
జిల్లా వ్యాప్తంగా పది మండలాల్లో కంటైన్మెంట్ల సంఖ్య మరింత పెరుగుతూ పోతుంది. తణుకులో దేవిదుర్గానగర్, పాలమూరి వారివీధి, దువ్వ, పాలకోడేరు మండలం గొల్లలకోడేరు, విస్సాకోడేరు, రామాలయం వద్ద, గణపవరం మండలం ఎస్.కొండేపాడు, వీరవాసరం గ్రామంలో మత్స్యపురి రోడ్డు, వడ్డిగూడెం రోడ్డు, కొవ్వూరు మండలం దొమ్మేరు, తాడేపలి ్లగూడెం పట్టణంలో మామిడితోట, కోడై చెరువు, గాంఽధీబొమ్మసెంటర్, పిల్లకర్రవారి వీధి, ఉంగుటూరు మండలం కాలవగట్టు సుబ్రహ్మణ్య టెంపుల్, అత్తిలి మండలం ఆరావళిలో కొత్త కంటైన్మెంట్లను తెరచారు.
ఎవరికీ ఇబ్బంది కలగనీయవద్దు : కలెక్టర్
జిల్లాలో ఉన్న కొవిడ్ కేర్ సెంటర్లు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా చూడాలని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. కొవిడ్ ఆసుపత్రులు ఆశ్రం, తాడేప ల్లిగూడెం ఏరియా ఆసుపత్రి, భీమవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఉన్న బాధితులు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఏలూరు కొవిడ్ కేర్ సెంటర్లలో ఉన్న బాధితులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలన్నారు. తన ఛాంబర్లో గురువారం తాజా పరిస్థితిని సమీక్షించారు. పాజిటివ్ వచ్చినా తక్కువ లక్షణాలు ఉన్నవారికి హోం ఐసోలేషన్‌లోనూ, వ్యాధి లక్షణాలు త్రీవంగా ఉన్నవారిని ఆసుపత్రిలోను ఉంచి చికిత్స అందించాలన్నారు. జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ర్యాండమ్ పరీక్షల సంఖ్య పెంచాలన్నారు. సమావేశంలో జేసీ హిమాన్షుశుక్లా, జడ్పీ సీఈవో పాల్గొన్నారు.
బాగుంటే ఇంటి దగ్గరే వైద్యం : డీఎంహెచ్‌వో
కరోనా పాజిటివ్ రోగులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక నుంచి పాజిటివ్ వచ్చిన అనారోగ్య లక్షణాలు లేకుండా ఉన్నవారికి హోం క్వారంటైన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి నిచ్చిందని డీఎంహెచ్‌వో డాక్టర్ సునంద వెల్లడించారు. జిల్లాలో పాజిటివ్ బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు.
బీపీ, మధుమేహం, దీర్ఘకాలిక వ్యాధులు లేకుండా ఆక్సిజన్ లెవెల్లు సరిగ్గా ఉంటే బాధితులు ఇంట్లోనే హోం క్వారంటైన్‌గా ఉండేలా అనుమతిస్తామన్నారు. వీరికి ప్రతిరోజు టెలీ కన్సల్టెన్సీ విధానంలో వైద్యులు సేవలందిస్తారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా టెస్టులు నిర్వ హించేందుకు ఆర్టీసీ ఇంద్ర ఏసీ బస్సులను సంచార ల్యాబ్‌లుగా ఉపయోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.వీటిలో ఆధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేశారని, పది మందికి ఒకేసారి కరోనా పరీక్షలు చేసే వెసులు బాటు ఉంటుందన్నారు. జిల్లాలో రోజుకు రెండు వేల మందికి పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.