జిల్లాలో 114 అనుమానిత కేసులు

ABN , First Publish Date - 2020-03-18T06:27:15+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాధి నుంచి రక్షించుకోవడానికి ప్రజలను అప్రమత్తం చేస్తు న్నారు.

జిల్లాలో 114 అనుమానిత కేసులు

ఏలూరు క్రైం, మార్చి 17 : కరోనా వైరస్‌ వ్యాధి నుంచి రక్షించుకోవడానికి ప్రజలను అప్రమత్తం చేస్తు న్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో  ఇప్పటికే కరోనా అనుమానిత కేసులకు వైద్య సేవలు అందించడానికి 10 పడకలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ నాలుగు కేసులు చేరాయి.వీటిలో మూడు కేసులు కరోనా వ్యాధి లేకపోవడంతో డిశ్చార్జ్‌ అయ్యారు. మరో అనుమానిత కేసు ఉంది.ఆ వ్యక్తి నుంచి లాలాజలాన్ని, ముక్కు నుంచి వచ్చే నీరును వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు.


రిపోర్టు బుధవారం నాటికి రావచ్చునని ఆసుపత్రి అధికారులు ఎదురు చూస్తున్నారు. అయితే అతను ఆరోగ్యంగానే ఉండడం, జ్వరం కూడా తగ్గిపో వడంతో  అతని బంధువులు డిశ్చార్జ్‌ చేయాలని కోరిన ప్పటికీ రిపోర్టులు వచ్చిన తరువాత డిశ్చార్‌ చేస్తామని అధికారులు వెల్లడించారు. దీంతో ప్రస్తుతం అతను వార్డులోనే చికిత్స పొందుతున్నాడు. మంగళవారం వరకూ మొత్తం 114 మందిని కరోనా అనుమాని తు లగా లెక్క తేల్చారు. వీరిలో 24 మంది 28 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.89 మంది అను మానితులుగా ఉన్నారు. ఒక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అదనపు వివరాలను 0866 2410978 నెంబరులో సంప్రదించాలి. 

Updated Date - 2020-03-18T06:27:15+05:30 IST