కొవిడ్‌ బాధితులకు 10 వాహనాలు

ABN , First Publish Date - 2020-07-08T11:19:54+05:30 IST

కరోనా బాధితులను కొవిడ్‌ ఆసుపత్రులకు తరలించడానికి జిల్లాలో 10 వాహనాలను ఏర్పాటు చేశామని 104, 108 వాహనాల సీఈవో

కొవిడ్‌ బాధితులకు 10 వాహనాలు

104, 108 వాహనాల సీఈవో ఎంఎస్‌ఆర్‌ స్వరూప్‌


ఏలూరు క్రైం, జూలై 7 : కరోనా బాధితులను కొవిడ్‌ ఆసుపత్రులకు తరలించడానికి జిల్లాలో 10 వాహనాలను ఏర్పాటు చేశామని 104, 108 వాహనాల సీఈవో ఎంఎస్‌ఆర్‌ స్వరూప్‌ అన్నారు. ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు.


రాష్ట్రాల్లో 108 అంబులెన్సులు 752 ఉండగా ప్రస్తుతం ఏపీకి 730 ఏర్పాటు చేశారన్నారు. 104 సేవల వాహనాలు ఉమ్మడి రాష్ట్రాల్లో 299 ఉండగా ప్రస్తుతం ఏపీలో 676 ఉన్నాయన్నారు. ఈ వాహనాలపై 6900 మంది నిరుద్యోగులకు ఉపాధి లభించిందన్నారు. రాష్ట్రం మొత్తం మీద అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టు వాహనాలు 214 ఉన్నాయని పశ్చిమగోదావరి జిల్లాలో 14 వాహనాలు ఉన్నాయన్నారు. సమావేశంలో జీఎం సునాథ్‌, జిల్లా మేనేజర్‌ జి గణేశ్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-07-08T11:19:54+05:30 IST