యువతకు సేవా దృక్పథం ఉండాలి

ABN , First Publish Date - 2020-12-25T05:50:22+05:30 IST

సేవా దృక్పథం, సామాజిక స్పృహను యువత కలిగి ఉండాలని జేసీ వెంకటరావు తెలిపారు. గురువారం కలెక్టర్‌లోని ఆడటోరియంలో జూనియర్‌ , యూత్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు.

యువతకు సేవా దృక్పథం ఉండాలి


జేసీ వెంకటరావు

విజయనగరం (ఆంధ్రజ్యోతి) డిసెంబరు 24 :  సేవా దృక్పథం, సామాజిక స్పృహను యువత కలిగి ఉండాలని జేసీ వెంకటరావు తెలిపారు. గురువారం కలెక్టర్‌లోని ఆడటోరియంలో జూనియర్‌ , యూత్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెడ్‌క్రాస్‌ సొసైటీ అందించే సేవల్లో విద్యార్థులు, యువత భాగస్వాములై,  ఆరోగ్యకర  సమాజ నిర్మాణానికి దోహదపడాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు  చిన్ననాటి నుంచే సేవల వైపు దృష్టి సారించేలా తల్లితండ్రులు ప్రోత్సహించాలన్నారు.  జిల్లాలో 369 ప్రాథమిక ఉన్నత పాఠాశాలలు, 114 జూనియర్‌, 75 డిగ్రీ కళాశాలను ఉన్నాయని, వాటిలో చదువుతున్న విద్యార్థులను  సొసైటీ సభ్యులుగా చేర్చే పక్రియ చేపట్టాలని సూచించారు. మండల స్థాయి కమిటీలను నియమించి రెడ్‌క్రాస్‌ సేవలను విస్తృతం చేయాలని తెలిపారు.   రెడ్‌క్రాస్‌ అంటే రక్తదానం ఒక్కటే కాదని, అన్ని సేవలకు చిరునామాగా నిలవాలని జేసీ  చెప్పారు.  ఈ సమావేశంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్రాంచి చైర్మన్‌ కేఆర్‌డీ ప్రసాదరావు, డీఎంహెచ్‌వో రమణకుమారి, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-12-25T05:50:22+05:30 IST