తప్పని పడిగాపులు
ABN , First Publish Date - 2020-12-16T05:24:42+05:30 IST
ఆధార్ అనుసం ధానం కోసం గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. మక్కువ మండలం నంద నుంచి సుమారు 25 మంది గిరిజనులు మంగళవారం ఇక్కడకు చేరుకున్నారు.
బొబ్బిలి: ఆధార్ అనుసం ధానం కోసం గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. మక్కువ మండలం నంద నుంచి సుమారు 25 మంది గిరిజనులు మంగళవారం ఇక్కడకు చేరుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వారికి ఆధార్ పనులు జరగలేదు. వైసీపీ నేత శంబంగి వేణుగోపాలనాయుడు, సీఐ కేశవ రావు, వ్యాపారవేత్త ముత్యాలు, ఆర్టీసీ ఉద్యోగి వెంకటేశ్వరరావు, రిటైర్డ్ టీచర్ అన్వర్‌బాషా, సామాజిక కార్యకర్త కృష్ణదాసు స్పందించి వారికి భోజన, వసతి కల్పించి దుప్పట్లు అందించారు.