విజయమే లక్ష్యంగా పనిచేయండి
ABN , First Publish Date - 2020-03-08T10:59:22+05:30 IST
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ

రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నేత విజయసాయి రెడ్డి
దాసన్నపేట, మార్చి 7: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేటర్ విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం విజయనగరం శివారులోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి జరిగింది. దీనికి విజయసాయి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. తొమ్మిది నెలల కాలంలో ప్రభుత్వం ఊహించని విధంగా సంక్షేమ పథకాలు రూపొందించిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ ప్రతిష్టంగా తీసుకుందని, పార్టీ విజయం సాధించడం ఎంతో ముఖ్యమన్నారు. ఎమ్మెల్యేలకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయరాదన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులు సమన్వయంతో పనిచేసి, వైసీపీని గెలుపు తీరాలకు చేర్చాలన్నారు.
ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల స్థలాలు ఉగాది రోజున ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, తొమ్మిది నెలల కాలంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కు దక్కుతుందన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లాలో వైసీపీ గెలుపే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుదామన్నారు.
ఎక్కడైనా మద్యం, డబ్బు పంపిణీ జరిగితే, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ ప్రకారం అనర్హత వేటు పడుతుందన్నారు. పార్టీ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, ఎంవీ సత్యనారాయణ, గొట్టేటి మాధవి, ఎమ్మెల్యేలు రాజన్నదొర, కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, శంబంగి, కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు, నాయకులు మరిశర్ల తులసీ, పరీక్షిత్‌రాజు, మజ్జి శ్రీనివాసరావు, కేవీ సూర్యనారాయణరాజు, అంబళ్ల శ్రీరాముల నాయుడు, ఎంఎల్‌ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.