కష్టపడి పనిచేయండి

ABN , First Publish Date - 2020-07-22T11:47:38+05:30 IST

కష్టపడి పని చేసి ఉద్యోగాలకు వన్నె తేవాలని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ కోరారు. ఏపీపీఎస్‌సీ ద్వారా కొత్తగా ఎంపికైన 106 మంది

కష్టపడి పనిచేయండి

 కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ 


కలెక్టరేట్‌, జూలై 21: కష్టపడి పని చేసి ఉద్యోగాలకు వన్నె తేవాలని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ కోరారు. ఏపీపీఎస్‌సీ ద్వారా కొత్తగా ఎంపికైన 106 మంది గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శు లకు మంగళవారం కలెక్టర్‌ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు.


గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని సూ చించారు. జిల్లాలో మొత్తం 120 పంచాయతీ కార్య దర్శి పోస్టులకుగాను 106 మందికి పోస్టింగ్‌ ఇవ్వగా మిగిలిన 14 పోస్టుల్లోని మూడు ఖాళీలకు అర్హత గల అభ్యర్థులు లభించలేదు. క్రీడాకారులకు కేటాయించిన రెండు పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. 4 పోస్టులకు అభ్యర్థులు తమ ధ్రువ పత్రాలు సమర్పించాల్సి ఉంది. ఒక అభ్యర్థి సరైన ధ్రువ పత్రాలు సమర్పించకపోవడంతో తిరస్కరించారు. మరో నలుగురు అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాలేదు.

Updated Date - 2020-07-22T11:47:38+05:30 IST