అత్తంటి ఎదుట మహిళ మౌన పోరాటం

ABN , First Publish Date - 2020-12-28T05:06:31+05:30 IST

తన భర్త కావాలని కొమరాడలో ఓ మహిళ అత్తింటి ఎదుట శనివారం రాత్రి మౌన దీక్ష చేపట్టింది. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ జ్ఞానప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం... వంగర మండలానికి చెందిన రమాదేవితో కొమరాడకు చెందిన జాడ సన్యాసిరావు కుమారుడు నందీశ్వరరావు కు 2009లో వివాహం జరిగింది.

అత్తంటి ఎదుట మహిళ మౌన పోరాటం

ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు

కొమరాడ, డిసెంబరు 27: తన భర్త కావాలని కొమరాడలో ఓ మహిళ అత్తింటి ఎదుట శనివారం రాత్రి మౌన దీక్ష చేపట్టింది. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ జ్ఞానప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం... వంగర మండలానికి చెందిన రమాదేవితో కొమరాడకు చెందిన జాడ సన్యాసిరావు కుమారుడు నందీశ్వరరావు కు 2009లో వివాహం జరిగింది. కొద్ది నెలల తర్వాత భార్యా భర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో నందీశ్వరరావు కుటుంబ సభ్యులపై పోలీసులకు  రమాదేవి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుంది... ఈ క్రమంలో తన భర్త నందీశ్వరరావు కావాలంటూ ఆమె కొమరాడ మెయిన్‌రోడ్డులో ఉన్న భర్త ఇంటి ముందు శనివారం రాత్రి 7 గంటల నుంచి మౌన దీక్ష చేపట్టింది. అయితే ఆ సమయంలో ఇంటిలో భర్త, అత్తమామలు ఎవ్వరూ లేరు. దీంతో ఉన్నతాధికారుల సూచన మేరకు మౌన పోరాటం చేస్తున్న రమాదేవిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుంటే తనకు భర్త కావాలని, అందుకు తన ప్రాణం పోయేవరకు పోరాటం చేస్తానని రమాదేవి చెబుతోంది.  

Updated Date - 2020-12-28T05:06:31+05:30 IST