ఎందుకింత నిర్లక్ష్యం?

ABN , First Publish Date - 2020-03-28T07:08:11+05:30 IST

విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారిపై కొం దరు అధికారులు సరిగ్గా దృష్టి

ఎందుకింత నిర్లక్ష్యం?

విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై నిఘా కరువు

కొందరు బయట తిరుగుతున్నా.. పట్టించుకోని వైనం

క్వారంటైన్‌ సెంటర్లకు తరలించని అధికారులు


విజయనగరం(ఆంధ్రజ్యోతి), మార్చి 27 :  విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారిపై కొం దరు అధికారులు సరిగ్గా దృష్టి సారించడం లేదు.  ఇటువంటి వారిని క్షుణ్నంగా పరిశీలించి, అనుమానితుల ను హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించాలి. అప్పటికీ ఆ వ్యక్తి గృహనిర్బంధంలో ఉండకుండా బయట తిరిగితే బలవంతంగానైనా తీసుకొచ్చి క్వారంటైన్‌ సెంటర్‌లో 14 రోజుల పాటు ఉంచి ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభు త్వం గట్టిగా చెబుతున్నా.. జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు జిల్లాలో సుమారుగా 416 మందికి పైగా ఉన్నారు. వీళ్లలో కొంతమందిని విడిచిపెట్టారు. మిగిలిన వారికి వైద్య పరీక్షలు చేయించి గృహ నిర్బంధంలోనే ఉంచారు.


వారిని ఇంటినుంచి బయటకు రానివ్వొద్దని మండల అధికారులు, వలంటీర్లకు హుకుం జారీ చేశారు. అయితే వారిపై నిఘా సరిగా లేక పోవడంతో కొంతమం ది కరోనా అనుమానితులు బయట విచ్చలవిడిగా తిరు గుతున్నారనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నవారిలో కొంతమంది మాత్రం స్నేహి తులు, బంధువుల ఇళ్లకు తిరుగుతున్నారనేది విశ్వసనీయ సమాచారం.  ఈ అనుమానితులకు నిజంగా వైరస్‌ ఉం టే  ఎవరు  బాధ్యత వహిస్తారని జిల్లావాసులు ప్రశ్ని స్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగ ఈ దిశగా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.


 తరలించరెందుకు..?

జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 49 ప్రభుత్వ, ప్రైవేట్‌ భవనాల్లో 70 క్వారంటైన్‌ కేంద్రాలుండగా, ఇందు లో 1455 గదుల్లో 2,105 బెడ్స్‌ ఏర్పాటు చేసినట్టు అధికా రులు తెలిపారు. ఇప్పటికీ వాటిల్లోకి ఒక్కరినీ తరలించ లేదు. దీంతో క్వారంటైన్‌ సెంటర్లు వెలవెలబోతున్నాయి. 

Updated Date - 2020-03-28T07:08:11+05:30 IST