డిప్యూటీ సీఎంకి గిరిజన సంక్షేమం పట్టదా..?
ABN , First Publish Date - 2020-07-27T11:16:13+05:30 IST
డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖామంత్రి పాముల పుష్పశ్రీవాణికి గిరిజన సంక్షేమం పట్టదా అని బీజేపీ జాతీయ ఎస్టీ మోర్చా కార్యదర్శి

జియ్యమ్మవలస, జూలై 26 : డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖామంత్రి పాముల పుష్పశ్రీవాణికి గిరిజన సంక్షేమం పట్టదా అని బీజేపీ జాతీయ ఎస్టీ మోర్చా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు ప్రశ్నించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ 14 నెలల పాలనలో వ్యవస్థీకృత మార్పులే తప్ప అభి వృద్ధి లేదని ఆరోపించారు. దీనికి నియోజకవ ర్గంలో దీర్ఘకాలిక సమస్యలే నిదర్శనమన్నారు. పూర్ణపాడు- లాబే సు వంతెన నిర్మాణం నేటికీ అవగత మవలేదని, తోటప ల్లి రిజర్వాయర్ నిర్మాణం పూర్తయినా నిర్వాసితులకు సరైన వసతి, మౌలిక సదుపాయాలు కల్పించలేదని, గు మ్మడిగెడ్డను నేటికీ వట్టిగెడ్డలో అనుసంధానం చేయలేదని అన్నారు. ఐటీడీఏ నిబద్ధ త గల ప్రాజెక్టు అధికారిని నియమించలేక పోవడం శోచనీయమన్నారు. ఫలితంగా గిరిజన, మైదాన ప్రాంతప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.