-
-
Home » Andhra Pradesh » Vizianagaram » What did you do to Thotapalli
-
‘తోటపల్లి’కి మీరేం చేశారు?
ABN , First Publish Date - 2020-11-22T04:53:44+05:30 IST
గడచిన ఏడాదిన్నర కాలంలో తోటపల్లి ప్రాజెక్టు కోసం ఏం చేశారో వైసీపీ నాయకులు చెప్పాలని టీడీపీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ప్రశ్నించారు. రెడ్డిపేట సమీపంలో ఉన్న తోటపల్లి కుడి ప్రధాన కాలువ వద్ద పార్టీ మండల అధ్యక్షుడు రౌతు కామునాయుడుతో కలిసి శనివారం విలేకరులతో మాట్లాడారు.

టీడీపీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు నాగార్జున
చీపురుపల్లి, నవంబరు 21: గడచిన ఏడాదిన్నర కాలంలో తోటపల్లి ప్రాజెక్టు కోసం ఏం చేశారో వైసీపీ నాయకులు చెప్పాలని టీడీపీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ప్రశ్నించారు. రెడ్డిపేట సమీపంలో ఉన్న తోటపల్లి కుడి ప్రధాన కాలువ వద్ద పార్టీ మండల అధ్యక్షుడు రౌతు కామునాయుడుతో కలిసి శనివారం విలేకరులతో మాట్లాడారు. 2014లో తమ పార్టీ అధికారంలోకి వచ్చాకే తోటపల్లి కాలువ పనుల్లో 95 శాతం పూర్తి చేశామన్నారు. రిజర్వాయరు పరిధిలో 550కిగాను 450 కిలోమీటర్లు, చీపురుపల్లి మండలంలో 145కిగాను 135 కిలోమీటర్ల విస్తీర్ణంలో పిల్ల కాలువ పనులు పూర్తి చేశామన్నారు. ఈ ప్రభుత్వంలో కనీసం ఒక కిలోమీటరైనా పనులు చేశారా అని నాగార్జున ప్రశ్నించారు. దీనికి తోడు తోటపల్లి పనులు మరో ఐదేళ్లు నిలిపివేస్తూ ప్రభుత్వం జీవో తీసుకురావడం దారుణమన్నారు. పనులు నిలిచిపోవడం వల్ల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు గవిడి నాగరాజు, ఆరతి సాహు, రౌతు నారాయణరావు, బుంగ మహేశ్వరరావు, గడే సన్యాసప్పలనాయుడు, సప్ప సూరప్పడు తదితరులు పాల్గొన్నారు.