300 పల్లెల్లో ‘మనం-మన పరిశుభ్రత’ : డీపీవో

ABN , First Publish Date - 2020-09-06T10:42:49+05:30 IST

జిల్లాలోని 300కు పైగా గ్రామా పంచాయతీల్లో మనం-మన పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించాలని డీపీవో సునీల్‌ రాజ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. శనివారం తన కార్యాలయం నుంచి జూమ్‌ కాన్ఫ

300 పల్లెల్లో ‘మనం-మన పరిశుభ్రత’ : డీపీవో

 విజయనగరం (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని 300కు పైగా గ్రామా పంచాయతీల్లో మనం-మన పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించాలని  డీపీవో  సునీల్‌ రాజ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. శనివారం తన కార్యాలయం నుంచి జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలో ఉద్యోగులు, సిబ్బందితో మాట్లాడారు.  గ్రామాల్లో  పారిశుధ్య పనుల వేగవంతానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. 


ఇప్పటివరకు జిల్లాలోని 68 గ్రామాల్లో మాత్రమే మనం-మన పరిశుభ్రత కార్యక్ర మాన్ని చేపడుతుండగా, సర్కార్‌ ఆదేశాల మేరకు ఇకపై మండలానికి 10 గ్రామాలను ఎంపిక చేయాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో వీలును బట్టి 5 నుంచి 10 గ్రామలను ఎంపిక చేయాలన్నారు. ప్రస్తుతం 49 గ్రామ పంచాయతీల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలకు ఆమోదం లభించిందని, గాంధీ జయంతి నాటికి పూర్తి చేయాలని తెలిపారు.


మెడికల్‌, ప్లాస్టిక్‌ వ్యర్థాలను  ధ్వంసం చేసే  మిషన్లు 438 వరకు మంజూరైనట్లు ఆయన తెలిపారు.  జిల్లాలో ఉన్న చెత్తనుంచి సంపద తయారీ కేంద్రాలను  వినియోగంలోకి తీసుకురాలని ఆదేశించారు. 959 పంచాయతీల్లో ‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌’ సర్వే వారంలో పూర్తి చేసి నివేదిక అంద జేయాలని పీఆర్‌ఆర్‌డీలకు సూచించారు. ఇప్పటివరకు 23 పంచాయతీల్లో మాత్రమే సర్వే చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Updated Date - 2020-09-06T10:42:49+05:30 IST