అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2020-12-06T05:01:01+05:30 IST

అర్హులందరకీ సంక్షేమ పథకాలు అందించాలని వైసీపీ జిల్లా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ( చిన్నశ్రీను) తెలిపారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
సమావేశంలో మాట్లాడుతున్న చిన్న శ్రీను

 గుర్ల, డిసెంబరు 5: అర్హులందరకీ సంక్షేమ పథకాలు అందించాలని వైసీపీ జిల్లా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ( చిన్నశ్రీను) తెలిపారు.  శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో కల్యాణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మండల పరిషత్‌, సచివాలయ ఉద్యోగులు, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.   గృహ నిర్మాణాలు, ఇళ్ల పట్టాల కోసం ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నారని ఆ శాఖ  ఏఈ అచ్చియమ్మ, తహసీల్దార్‌ లావణ్యని అడిగారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే  వారికి అవకాశం కల్పించాలన్నారు.  గ్రామాల్లో   సచివాలయాలు, ఆర్‌బీకే, వెలెనెస్‌ సెంటర్ల పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రతి సచివాలయానికి సీసీ రోడ్లు,  డ్రైనేజీ నిమిత్తం సుమారు రూ.10 లక్షలతో ప్రతిపాదనలు తయారుచేయాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. ఈ  సమావేశంలో పశు వైద్యుడు సుబ్రహ్మణ్యం , వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు   సూర్యనారాయణ రాజు, మండల నాయకులు శీర అప్పలనాయుడు, పొట్నూరు సన్యాసినాయుడు, వరద ఈశ్వరరావు, వెంకటరమణ పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2020-12-06T05:01:01+05:30 IST